: వరంగల్ జిల్లాలో ఐటీ ఇంక్యుబేషన్ టవర్లు ప్రారంభించిన కేటీఆర్


వరంగల్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రారంభించింది. జిల్లాలోని మడికొండ సెజ్ లో రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన టవర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రోజు వరంగల్ చరిత్రలో గొప్ప రోజని, ఈ రోజును వరంగల్ విద్యార్థులు మరచిపోవద్దని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో వరంగల్ ను ఐటీ హబ్ గా తీర్చి దిద్దుతామని చెప్పారు. ఇకపై ఐటీ ఉద్యోగాల కోసం యువకులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హైదరాబాదుకు సమీపంలో వరంగల్ వంటి మహానగరం ఉండటం మనందరి అదృష్టమన్న కేటీఆర్, రాబోయే 18 నెలల్లో వెయ్యి మందికి వరంగల్ లో ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్ లో శిక్షణ ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News