: దేశ చరిత్రలో కేజీ పప్పు ధర 200రూ కి చేరడం ఇదే ప్రథమం: రాహుల్ గాంధీ


కేజీ కందిపప్పు ధర రెండు వందల రూపాయలకు చేరడం ఇదే ప్రథమమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో ఆయన రైతులతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో విఫలమైందని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. దేశ చరిత్రలో కేజీ పప్పు ధర 200 రూపాయలకు చేరడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన మోదీ ఆచరణలో మొండిచెయ్యి చూపారని ఆయన అన్నారు. దేశంలోని రైతులకు 24 గంటల విద్యుత్ అందజేస్తామని చెప్పిన మోదీ, రైతులకు నాలుగైదు గంటలు మాత్రమే ఇస్తూ, తమకు నచ్చిన పారిశ్రామిక వేత్తలకు మాత్రం 24 గంటల విద్యుత్ అందజేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతాంగ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతానని ఆయన రైతులకు మాట ఇచ్చారు.

  • Loading...

More Telugu News