: సౌదీని ముంచేసిన చమురు...ఉద్యోగ మేళాకు సౌదీ యువకులు


ముడి చమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల నుంచి 30 డార్లకు పడిపోవడంతో, ఇన్నాళ్లూ చమురు ఆదాయంతో సర్వసుఖాలు అనుభవిస్తున్న సౌదీ అరేబియాలో పరిస్థితులు మారుతున్నాయి. దీంతో ఆక్కడ ప్రభుత్వం కల్పించే ఉచిత విద్య, ఉచిత వైద్యం, పన్నుల్లేని ఆదాయం, ఇతర రాయితీలు కొనసాగించడం అన్నది కష్టంగా మారింది. దీంతో ఇంతవరకు ఖరీదైన దుస్తులు వేసుకుని వివిధ దేశాలకు చెందిన యువకులకు ఉపాధి కల్పించే సౌదీ అరేబియా యువకులు ఇప్పుడు ఉద్యోగ మేళాలకు హాజరవుతున్నారు. రియాద్ లో గత రెండు వారాల్లో మూడు జాబ్ మేళాలు జరగగా, వాటికి తళతళ మెరిసే బట్టలతో రెజ్యూమెలు పట్టుకుని యువకులు క్యూ కట్టారు.

  • Loading...

More Telugu News