: అమ్మవారి ఆశీస్సులుండాలి...భోగభాగ్యాలతో తులతూగాలి: హీరో బాలకృష్ణ


మేడారం సమ్మక్క,సారలమ్మను దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ అన్నారు. మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు, ఈ పవిత్ర ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉందని. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించామని బాలయ్య అన్నారు. ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా గిరిజనుల పిల్లలకు ఉచిత విద్య, గురుకుల పాఠశాలల నిర్మాణం, జంపన్న వాగుపై వంతెన నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గతంలో తాము చేపట్టామని చెప్పారు. ‘మాజీ ముఖ్యమంత్రి, మా తండ్రి నందమూరి తారకరామారావు గారి పాలనలో ప్రజలకు సామాజిక న్యాయం అందింది. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని, భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News