: లక్ష్మారెడ్డీ... ఇదేందబ్బా!: ‘గాంధీ’లో సౌకర్యాల లేమిపై టీఎస్ మంత్రికి గవర్నర్ ఫోన్


హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా అవసరమైన మేరకు బెడ్లు లేని కారణంగా పెద్ద సంఖ్యలో రోగులు కింద పడుకుండిపోయిన వైనం గవర్నర్ కంట బడింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నరసింహన్ ఆసుపత్రి నుంచే తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫోన్ చేశారు. ఆసుపత్రిలోని అధ్వాన పరిస్థితులను మంత్రికి వివరించారు. ఇలాగైతే?.. ఎలాగంటూ దాదాపుగా నిలదీసినంత పనిచేశారు. దీంతో షాక్ తిన్న లక్ష్మారెడ్డి... వెనువెంటనే తేరుకుని త్వరలోనే ఆసుపత్రిలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని గవర్నర్ కు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News