: సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న బాలకృష్ణ దంపతులు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీ సమేతంగా మేడారం జాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఈ జాతరకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇటువంటి పండుగను ఓ రాష్ట్ర పండుగగా గుర్తించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అంతకుముందు మేడారం చేరుకున్న బాలయ్యకు అక్కడి వారు ఘన స్వాగతం పలికారు.