: ఐఎస్ఐఎస్ వద్ద అత్యంత వినాశకర 'డర్టీ బాంబ్'!
అత్యధిక వినాశనాన్ని సృష్టించగల 'డర్టీ బాంబ్'ను ఐఎస్ఐఎస్ తయారు చేస్తోందా? లేక ఇప్పటికే తయారు చేసి దాన్ని ఏదైనా ఓ పాశ్చాత్య దేశంపై ప్రయోగించే ప్రమాదం ఉందా? ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోయినప్పటికీ, ఓ ల్యాప్ టాప్ పరిమాణంలో ఉన్న పెట్టెలో భద్రపరిచిన ఐఆర్-192 రకం రేడియో ధార్మిక పదార్థాన్ని ఉగ్రవాదులు ఇరాక్ లోని బస్రా నుంచి అపహరించారని, వారు ఐఎస్ఐఎస్ కు చెందిన వారై ఉండవచ్చని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇది ఉగ్రవాదులకు చిక్కితే పెను ప్రమాదానికి అవకాశాలు ఉంటాయని ఇరాక్ ప్రభుత్వం ఆందోళనలో ఉందని 'డైలీ ఎక్స్ ప్రెస్' పేర్కొంది. దీన్ని పేలుడు పదార్థాలతో కలిపితే, డర్టీ బాంబు తయారవుతుందని, ఇది పేలితే ఓ భారీ నగరాన్ని సమూలంగా నాశనం చేయవచ్చని తెలిపింది.