: నంద్యాలలో ఘోరం... అగ్నిప్రమాదంలో సజీవదహనమైన నాలుగేళ్ల బాలిక
కర్నూలు జిల్లా నంద్యాలలో నేటి తెల్లవారుజామున ఘోరం చోటుచేసుకుంది. పట్టణంలోని అరుంధతీనగర్ లో ఎగసిపడ్డ మంటల్లో చిక్కుకుని నాలుగేళ్ల సాయివాణి సజీవ దహనమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వెలసిన మంటలు ఒక్కసారిగా సాయివాణి ఉంటున్న ఇంటితో పాటు సమీపంలోని మరికొన్ని ఇళ్లకు వ్యాపించాయి. ఈ క్రమంలో సాయివాణి తన తల్లిదండ్రులతో కలిసి సురక్షితంగానే బయటకు వచ్చింది. అయితే ఇంటిలోని సామగ్రి తీసుకువచ్చేందుకు తండ్రితో కలిసి తిరిగి ఇంటిలోపలికి వెళ్లిన సాయివాణి వేగంగా వెనక్కు రాలేకపోయింది. ఈ క్రమంలో మంటల్లో చిక్కిన ఆ బాలిక అగ్ని కీలలకు ఆహుతి అయ్యింది. దీంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.