: కేసీఆర్ కు అస్వస్థత... అందుకే మేడారం పర్యటన రద్దు!
తెలంగాణ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని, అందువల్లే మేడారానికి ఆయన వెళ్లలేకపోయారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి కేసీఆర్ నేడు సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకోవాల్సి వుంది. ఆయన కోలుకోగానే మేడారానికి బయలుదేరి వెళతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా, కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దుతో మడికొండలో ఆయన పాల్గొనాల్సిన ఇన్ క్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవం రద్దయింది. దీంతో పాటు అక్కడ జరపాల్సిన బహిరంగ సభను కూడా రద్దు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.