: జగన్ అండ్ బ్యాచ్ కు ఈడీ సమన్లు... మార్చి 28న హాజరుకావాలని తాఖీదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు నుంచి నిన్న సమన్లు జారీ అయ్యాయి. తన సంస్థ జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టిన హెటిరో, అరబిందో ఫార్మాలకు పాలమూరు జిల్లాలో ఆయన తండ్రి వైఎస్ హాయాంలోని ప్రభుత్వం కారుచౌకగా ప్రభుత్వ భూములు కట్టబెట్టిందన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈడీ ఆర్థిక నేరాల కోర్టులో నిన్న చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు... కేసులో నిందితులుగా ఉన్న జగన్, ఆడిటర్ విజయసాయిరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య... సహా మొత్తం 19 మందికి నోటీసులు జారీ చేసింది. మార్చి 28న జరగనున్న విచారణకు అంతా హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఈడీ కోర్టు పేర్కొంది.