: విశాఖపట్టణంలో సమీక్ష నిర్వహించిన రాజ్ నాథ్ సింగ్
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్టణంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పి.టక్కర్, డీజీపీ రాముడు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ డీజీపీలు హాజరయ్యారు. విశాఖపట్టణం చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, హరిబాబు, ఇతర బీజేపీ నేతలు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మావోయిస్టుల హింస 27 శాతం తగ్గిందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని ఆయనను కోరారు. రాష్ట్రానికి అదనపు పారామిలటరీ బలగాలు కేటాయించాలని ఆయనను అడిగారు. నేటి రాత్రికి విశాఖపట్టణంలో బసచేయనున్న రాజ్ నాథ్ సింగ్ రేపు ఒడిశా వెళతారు.