: రేపు మేడారానికి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మేడారం జాతరకు ఆయన విచ్చేస్తారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మలను కేసీఆర్ దర్శించుకుంటారు. కాగా, కాస్సేపటి క్రితం మేడారంలో గద్దెపై సమ్మక్క కొలువుతీరింది. భిన్న జాతులకు చెందిన గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం ఈ జాతరకు హాజరవుతుండటం విశేషం. తెలంగాణ కుంభమేళాగా, వనదేవతల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మేడారానికి ఇప్పటికే లక్షల సంఖ్యల్లో భక్తులు చేరుకున్నారు.