: అది పురుషుడి కోసం తయారు చేసిన పాత్ర: ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా తొలిసారిగా హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రముఖ నటుడు డ్వెన్ జాన్సన్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రియాంకా చోప్రా ఇప్పుడు స్పందించింది. 'బేవాచ్' సినిమాలో తనను ఎంపిక చేసిన పాత్రను ముందుగా పురుషుడి పాత్రగా రాశారని తెలిపింది. అయితే ఈ సినిమా దర్శకుడు తనను చూసి, మాట్లాడిన తరువాత ఆ పాత్రకు తానైతే బాగుంటుందని భావించి, దానిని స్త్రీ పాత్రగా మార్చి, తనకు ఆఫర్ చేశాడని వెల్లడించింది. హీరోయిన్ పాత్రలో నటిస్తే కంఫర్ట్ జోన్ లో ఉండి నటించాలని, అదే విలన్ అయితే ఆ జోన్ నుంచి బయటకు వచ్చి నటించవచ్చని తెలిపింది. ఈ పాత్రలో నటించేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని ప్రియాంకా చోప్రా చెప్పింది.