: పాక్ లో కోహ్లీ అభిమాని పరిస్థితేంటి?... కేజ్రీకి అనుపమ్ ఖేర్ ఘాటు సమాధానం


సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఘాటుగా స్పందించారు. జేఎన్ యూలో పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని విద్యార్థులను కొడతారా? దేశంలో అసలు చట్టం పనిచేస్తోందా? అంటూ కేజ్రీ అడగడాన్ని ఖేర్ ప్రస్తావిస్తూ, సమాధానం ఇచ్చారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమానినంటూ జనవరిలో ఓ పాకిస్థానీ వ్యక్తి తన ఇంటిపై భారత పతాకాన్ని ఎగురవేశాడు. అది తెలిసిన వెంటనే పాక్ పోలీసులు అతడిని అరెస్టు చేసి వెంటనే జైల్లో వేశారని, 'అక్కడ మనోళ్ల పరిస్థితి ఇలా ఉంది సర్!' అని అనుపమ్ వివరించాడు.

  • Loading...

More Telugu News