: విశాఖపట్టణంలో పెట్రోలియం యూనివర్శిటీ
విశాఖపట్టణంలో పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) తో పెట్రోలియం శాఖ మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వశాఖ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి ఏయూ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అడ్మిషన్లు, పరిపాలనాపరమైన వ్యవహారాలన్నీ కూడా ఏయూ నుంచే నడిపించనున్నారు. ఈ నెల 4న హిందూస్థాన్ పెట్రోలియం శాఖాధికారులు, ఏయూ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీలో పెట్రోలియం వర్శిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించడం జరిగిందని తెలిపింది.