: పోప్ కు కోపమొచ్చిన వేళ ...వీడియో మీరూ చూడండి!


ఎప్పుడూ చిరునవ్వుతో, ప్రశాంతంగా ఉండే పోప్ ఫ్రాన్సిస్ వదనం కొద్ది క్షణాలపాటు ఎర్రబారటమే కాదు, కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వెలువడ్డాయి కూడా. ఈరోజు మెక్సికోలోని మొరిలియా సిటీలో జరిగిన సంఘటనే అందుకు కారణం. పోప్ ను దర్శించేందుకని అక్కడికి చేరుకున్న ప్రజలకు ఆయన అభివాదం చేశారు. అనంతరం, వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్న సందర్భంలో ఒక వీరాభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. పోప్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా ముందుకు లాగడంతో ఆయన అదుపు తప్పి వీల్ చైర్ లో ఉన్న ఒక వ్యక్తి పై పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఆయన అంగరక్షకులు వెంటనే పోప్ ను పట్టుకున్నారు. ఈ సంఘటనతో నిర్ఘాంతపోయిన పోప్ కొన్ని క్షణాల పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తేరుకున్న ఆయన మళ్లీ చిరునవ్వులు చిందిస్తూ, చేతులూపుతూ అక్కడి నుంచి కదిలారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News