: గాంధీ పేరులోనే దేశభక్తి ఉంది... కిషన్ రెడ్డే పేరు మార్చుకోవాలి: భట్టి
జేఎన్ యూలో విద్యార్థులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పేరును రాహుల్ మెమన్ లేదా రాహుల్ అఫ్జల్ గా మార్చుకోవాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సలహా ఇవ్వడంపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. గాంధీ పేరులోనే దేశభక్తి ఉందని హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. రాహుల్ పేరు కన్నా ముందు... కిషన్ రెడ్డే పేరు మార్చుకోవాలని భట్టి సూచించారు. దేశ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే చరిత్ర బీజేపీ నేతలదని విమర్శించారు.