: విద్యార్థుల స్నేహం ముందు పార్టీల భావజాలం బలాదూర్!


పార్టీలు, విద్యార్థి సంఘాల పరంగా భావజాలాలు వేరైనా, స్నేహం ముందు అవన్నీ బలాదూర్ అని నిరూపించే ఘటనలు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్నాయి. విద్యార్థి నేత కన్నయ్య కుమార్ అరెస్ట్, కోర్టులో న్యాయవాదుల దాడికి నిరసనగా వర్శిటీకి చెందిన ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ ప్రదీప్ నర్వాల్, జేఎన్యూ స్కూల్ ఏబీవీపీ విభాగం అధ్యక్షుడు రాహుల్ యాదవ్, కార్యదర్శి అంకిత్ హాన్స్ లు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం చేసే పనులకు తాము భజంత్రీలుగా ఉండే అవకాశమే లేదని వారు వెల్లడించారు. కన్నయ్యపై మోపిన ఆరోపణలు వెనక్కు తీసుకుని తక్షణం విడుదల చేయాలని కోరుతూ మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించగా, దాదాపు అన్ని సంఘాలూ దీనికి మద్దతు పలకడం గమనార్హం.

  • Loading...

More Telugu News