: రణబీర్ తో ప్రేమ వద్దు... నీ హృదయం ముక్కచెక్కలే: ఏడేళ్ల క్రితమే కత్రినాకు సల్మాన్ వార్నింగ్!
గత కొన్నేళ్లుగా సాగుతున్న రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం చెడిందన్న వార్తలు వచ్చిన తరువాత, వీరిద్దరి మధ్యా బంధం చెడుతుందని కండలవీరుడు సల్మాన్ ఏడేళ్ల క్రితమే అనుమానించాడని 'దక్కన్ క్రానికల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అంతకన్నా ముందు సల్మాన్, కత్రినాల మధ్య కొంతకాలం ప్రేమ పర్వం నడవగా, రణబీర్ వైపు కత్రినా వెళుతుండటాన్ని గమనించిన సల్మాన్ ఆమెను హెచ్చరించాడట కూడా. "నన్ను వదిలి రణబీర్ కోసం వెళుతున్నావు. నీ హృదయం ముక్కచెక్కలవుతుంది. అతనితో వెళ్లవద్దు. పెద్ద తప్పు చేస్తున్నావు" అని 2009లోనే హెచ్చరించాడట. రణబీర్ తో 'అజబ్ ప్రేమ్ కీ ఘజబ్ కహానీ' చిత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్టు పత్రిక వెల్లడించింది.