: జేఎన్ యూలో దేశ వ్యతిరేక నినాదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు


ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశ వ్యతిరేక నినాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నైతిక మద్దతు పేరుతో వారికి వత్తాసు పలకడం సిగ్గుచేటని ప్రతిపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు. పార్లమెంటుపై దాడిచేసిన వారికి మద్దతు ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. వర్సిటీల్లో తీవ్రవాదుల సంస్మరణ సభలు ఎలా నిర్వహిస్తారన్న వెంకయ్య, తీవ్రవాదులకు వత్తాసు పలికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విశాఖలో 'సమీర్' ప్రత్యేక పరిశోధన కేంద్రం శంకుస్థాపనకు హాజరైన వెంకయ్య ఈ విధంగా మాట్లాడారు. సమీర్ కేంద్రం ద్వారా విశాఖ గుర్తింపు మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఏపీని ఆదుకుంటోందని, ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో కూడా ఏపీ ముందుంటుందని చెప్పారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ పోటీల్లో విశాఖ ముందంజలో ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News