: కన్నయ్యకు మద్దతుగా కదిలిన ఏబీవీపీ... కోర్టు ఘటనలను నిరసిస్తూ ముగ్గురు రాజీనామా!


"కాలేజీలో ఉన్నంతవరకూ కొట్టుకుంటాం... తిట్టుకుంటాం. మాజోలికి ఎవరైనా వస్తే, అందరమూ ఒక్కటే. తాటతీస్తాం" అప్పుడెప్పుడో వచ్చిన సినిమాలోని ఓ డైలాగ్ ఇది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనూ ఇదే జరుగుతోంది. తోటి విద్యార్థికి అన్యాయం జరుగుతోందని భావిస్తూ విద్యార్థిలోకం కదులుతోంది. మొన్నటి వరకూ ఉప్పు నిప్పులా ఉన్న విద్యార్థి సంఘాలు, కోర్టులో జరిగిన ఘటనల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కన్నయ్య నిందితుడైతే, విచారించి జీవిత శిక్ష విధించినా సమ్మతమేనని, విద్యార్థి సంస్కృతిని తాలిబన్ సంస్కృతిగా మార్చాలని చూస్తున్నారని ఆరోపిస్తూ, ఏబీవీపీ విద్యార్థి నాయకుడు నర్వాల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు కూడా రాజీనామాలు చేశారు. వీరి రాజీనామా విషయాన్ని పీటీఐ వార్తాసంస్థ స్పష్టం చేసింది. కేంద్రంపై ఏబీవీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారని, విద్యార్థులపై కేంద్ర విధానాలకు వ్యతిరేకంగానే రాజీనామాలు చేస్తున్నట్టు వీరు ఆ లేఖలో తెలిపారని పీటీఐ వెల్లడించింది. కాగా, తమకు ఎలాంటి రాజీనామా లేఖలు అందలేదని ఏబీవీపీ కేంద్ర కమిటీ వెల్లడించడం గమనార్హం.

  • Loading...

More Telugu News