: ఎవరెన్ని చేసినా... అన్నాడీఎంకేను ఏమీ చేయలేరు: కరుణ కొడుకు అళగిరి సంచలన వ్యాఖ్యలు


తమిళనాట రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచిన డీఎంకే అధినేత కరుణానిధికి ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బే తగిలేలా ఉంది. తన పెద్ద కుమారుడు అళగిరి ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకేకు క్రమంగా దగ్గరవుతున్నారు. తన సోదరుడు స్టాలిన్ కు తండ్రి ఇస్తున్న ప్రాధాన్యంపై నిరసన గళమెత్తిన అళగిరి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేను అడ్డుకునేందుకు డీఎంకే... కాంగ్రెస్ తో జట్టు కడుతోంది. ఈ దిశగా ఇప్పటికే కీలక చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలో నిన్న అళగిరి చేసిన వ్యాఖ్యలపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా... ఎవరు ఎవరితో జతకట్టినా అధికార అన్నాడీఎంకేను ఏమీ చేయలేరని అళగిరి వ్యాఖ్యానించారు. అంతేకాక కాంగ్రెస్ తో డీఎంకే మైత్రిపై కూడా అళగిరి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు కూడా రాజకీయ లక్ష్యం లేని పార్టీలేనని ఆయన విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News