: తీహార్ జైలుకు కన్నయ్య కుమార్ తరలింపు


దేశ ద్రోహం కింద అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ను తీహార్ జైలుకు తరలించారు. కన్నయ్య కుమార్ ను ఈ రోజు పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా మార్చి 2 వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అనంతరం మూడు గంటలపాటు అతన్ని కోర్టు గదిలోనే ఉంచి.. సాయంత్రం తీహార్ జైలుకు తరలించారు. అంతకుముందు కన్నయ్యకుమార్ ను కోర్టులో హాజరుపరిచే సమయంలో న్యాయవాదులు అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని అతనిపై ఎటువంటి దాడులు మళ్లీ జరగకుండా చూసేందుకే కొన్ని గంటల పాటు కన్నయ్యను కోర్టు గదిలోనే ఉంచినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News