: పెట్రోలు ధర తగ్గింది ... డీజిల్ ధర పెరిగింది!
పెట్రోలు ధర లీటర్ కు 32 పైసలు తగ్గగా, డీజిల్ ధర మాత్రం లీటర్ కు 28 పైసలు పెరిగింది. చమురు సంస్థలు ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశాయి. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. కాగా, గత నెల 15న పెట్రోల్ పై 32 పైసలు, డీజిల్ పై 85 పైసలు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ వినియోగదారులకు మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు. పెట్రోల్ ధర తగ్గిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంచుతుండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి.