: అమెరికా కోర్టు ఆదేశాలు శిరసావహించడం కుదరదన్న యాపిల్


హంతకుడి ఫోన్ ను అన్ లాక్ చేయాలన్న అమెరికా కోర్టు ఆదేశాలు శిరసావహించడం కుదరదని స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ స్పష్టం చేసింది. గత ఏడాది శాన్ బెర్నార్డినోలో కాల్పులకు పాల్పడి 14 మంది మృతికి కారకుడైన రిజ్వాన్ ఫరూఖ్ ఫోన్ ను అన్ లాక్ చేసి, ఎఫ్బీఐ దర్యాప్తుకు సహకరించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. యూఎస్ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి, సహకరించాలని కోరుతోందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. దీని వల్ల తమ కస్టమర్ల భద్రత సందేహంలో పడుతుందని, దీనికి తాము పూర్తి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. 2014 తరువాత విడుదలైన ఫోన్లలో డిఫాల్ట్ సెట్టింగ్స్ లో ఎన్ క్రిప్షన్ ఆప్షన్ ఉందని, దానిని ఆన్ చేసి ఉంటే సమాచారం భద్రంగా ఉంటుందని, లేని పక్షంలో ఆ ఫోన్ అన్ లాక్ కోడ్ తెలిసి ఉండాలని స్పష్టం చేసింది. 10 సార్లు తప్పుగా కోడ్ ను ఎంటర్ చేస్తే, ఆ ఫోన్ లోని సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుందని యాపిల్ తెలిపింది. తమ సిబ్బంది కూడా ఆ ఫోన్ ను అన్ లాక్ చేయలేరని యాపిల్ స్పష్టం చేసింది. అందుకే ఎన్నిసార్లు కోడ్ ఎంటర్ చేసినా స్టోరేజ్ డిలీట్ కాకుండా చూడాలని ఎఫ్బీఐ కోరుతోంది. ఫరూఖ్ నాలుగు అంకెల కోడ్ వాడి ఉంటాడని, ఆ కోడ్ కాంబినేషన్ ఓపెన్ చేయాలంటే మొత్తం 10,000 కాంబినేషన్లు ట్రై చేయాలని ఎఫ్బీఐ అభిప్రాయపడుతోంది.

  • Loading...

More Telugu News