: భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉంది: కన్నయ్య కుమార్


భారతరాజ్యాంగంపై తనకు విశ్వాసం ఉందని జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కోర్టుకు తెలిపాడు. ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. కోర్టు ప్రాంగణంలోనే న్యాయవాదులు తనపై దాడి చేశారని మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశాడు. న్యాయవాదులు దాడి చేస్తుంటే పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని న్యాయమూర్తికి తెలిపాడు. దీంతో కేసు విచారణ ఆపేసిన న్యాయమూర్తి మార్చి 2 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. విచారణ ముగిసిన అనంతరం కూడా కన్నయ్య కుమార్ పై దాడికి న్యాయవాదులు ప్రయత్నించడం గమనార్హం.

  • Loading...

More Telugu News