: ధావన్ వచ్చాడు.. దంచాడు
శిఖర్ ధావన్ (63 నాటౌట్) ఐపీఎల్ తాజా సీజన్ ను ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాయపడినా, మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టిన ధావన్.. ఫిఫ్టీతో మెరిశాడు. సంగక్కర, పెరెరా గైర్హాజరీలో టాపార్డర్ విఫలమైనా.. ధావన్ జట్టును ఆదుకున్నాడు. 45 బంతులెదుర్కొన్న ధావన్ 10 బౌండరీలు బాదాడు. కాగా, చివరల్లో అక్షత్ రెడ్డి (16 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.