: పెద్దమ్మతల్లి ఆలయంలో కేసీఆర్ దంపతులు.. నాన్నను చల్లగా దీవించమని మొక్కుకున్న కవిత


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. కేసీఆర్ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించారు. కాగా, టీఆర్ఎస్ ఎంపీ, కూతురు కవిత కూడా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘నాన్నను చల్లగా దీవించు తల్లి’ అని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. కవితతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News