: ఏపీలో ఐదు నగరపాలక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో ఐదు నగరపాలక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, ఒంగోలు నగరపాలక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తున్నట్టు తెలిపారు. వాటితో పాటు రాజంపేట నగర పంచాయతీ, కందుకూరు మున్సిపాలిటీలో కూడా ప్రత్యేక అధికారి పాలనను పొడిగించారు. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధుల కింద రూ.461.23 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.