: నిప్పుల గుండంలో పడిపోయిన భక్తురాలు... ‘జడల’ బ్రహ్మోత్సవాల్లో అపశృతి


నల్లగొండ చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండం మీదుగా నడిస్తే కష్టాలు తీరతాయని భావించిన ఓ మహిళ ప్రమాదంలో చిక్కుకుంది. నిప్పుల గుండంపై సాటి భక్తులు పరుగులు పెడుతున్న నేపథ్యంలో కాస్తంత లావుగా ఉన్న ఆ భక్తురాలు పరుగు తీస్తూ పట్టు తప్పి పడిపోయింది. నిప్పులపైనే పడిపోయిన ఆమె దుస్తులకు నిప్పుల సెగ తగిలి మంటలు చెలరేగాయి. అయితే వేగంగా స్పందించిన ఆలయ అధికారులు, పోలీసులు బాధితురాలిని నిప్పులపై నుంచి పక్కకు లాగారు. దీంతో స్వల్ప గాయాలతోనే ఆ మహిళ బయటపడగలిగింది.

  • Loading...

More Telugu News