: ఏ బహుమతి ఎవరికిస్తే మీకెందుకు?: మీడియాపై విరాట్ కోహ్లీ చిర్రుబుర్రులు!
తనను ఇబ్బందికర ప్రశ్నలను అడుగుతున్న మీడియాపై భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చిర్రుబుర్రులాడాడు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీని, "ఓ ఖరీదైన గడియారాన్ని బాలీవుడ్ లో ఎవరికైనా బహుమతిగా ఇవ్వాల్సి వస్తే, ఎవరికి ఇస్తారు?" అని ప్రశ్నించగా, "ఏ బహుమతి ఎవరికి ఇస్తే మీకెందుకు? బాలీవుడ్ లోనే ఉన్నవాళ్లకు ఎందుకిస్తాను? మా ఇంట్లో ఎవరికైనా గిఫ్ట్ గా ఇస్తాను. కాకుంటే జట్టు సభ్యులకు ఇస్తా" అన్నాడు. ఇక మానవ సంబంధాలపై మరో ప్రశ్నఅడగ్గా, ఎవరి గురించి అడుగుతున్నారని అంతెత్తున లేచాడు. ఇవి తనను అడగాల్సిన ప్రశ్నలు కాదని, కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలని కోప్పడ్డాడు. దీంతో అక్కడున్న ఇతరులు, మీడియా అవాక్కవ్వాల్సిన పరిస్థితి. ఎంతైనా అనుష్కతో ప్రేమ చెడిన తరువాత విరాట్ కాస్తంత అసహనం, కోపాన్ని పెంచుకుంటున్నాడన్నమాట!