: ట్విట్టర్ లో యాక్టివ్ గా హరీశ్ రావు...‘ఖేడ్’ విజయంపై ఆసక్తికర ట్వీట్!


టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు పనితీరులో తనకు తానే సాటి. ప్రత్యేక తెలంగాణ వాదంతో పురుడుపోసుకున్న టీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వెన్నెముకలాంటి వారాయన. తెలంగాణలో గడచిన పద్నాలుగేళ్లలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా, అక్కడ హరీశ్ వాలిపోయారు. పార్టీకి చిరస్మరణీయ విజయాలు అందించారు. తాజాగా మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఆయన టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అయితే ఎన్ని విజయాలు వచ్చినా, ఆయన సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేరు. ఖేడ్ లో రికార్డు విజయంతో ఆయన సోషల్ మీడియాలో యాక్టివేట్ అయ్యారు. ఖేడ్ విజయంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన కానుకగా నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రభుత్వ పనితీరును, సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారన్నదానికి ఈ ఘన విజయమే నిదర్శనం. రాజకీయంగా, వ్యక్తిగతంగా నాపై ఈ విజయం మరింత బాధ్యత పెంచింది. సిద్దిపేట తరహాలో నారాయణ్ ఖేడ్ ను అభివృద్ధి చేస్తా’’ అని ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News