: నల్లవాళ్లు ఎంత ఎదిగినా వారిని తెల్లజాతి గుర్తించదు: నటుడు శ్యామ్యూల్ ఎల్ జాక్సన్


నల్లవాళ్లు ఎంత ఎదిగినా తెల్లజాతి గుర్తించదని ‘ది హేట్ పుల్ ఎయిట్’ నటుడు శ్యామ్యూల్ ఎల్ జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. 67 సంవత్సరాల జాక్సన్ ఆవేదనకు కారణం లేకపోలేదు. ఈ మధ్య ఆస్కార్ అవార్డులకు అర్హులైనవారి జాబితాలో అందరూ తెల్లవారే ఉండటం, నల్లజాతీయులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో నల్లజాతీయులు తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. ఈ సందర్భంగానే జాక్సన్ కూడా నోరు విప్పారు. గతంలో తనకు జరిగిన అవమానాన్ని ఆయన గుర్తుచేశారు. ‘ఒకసారి నేను కారులో వెళుతుండగా.. హఠాత్తుగా ఐదుగురు పోలీసులు చుట్టుముట్టారు. కారులో నుంచి కిందకు దింపారు. నేలపై పడుకోబెట్టి, కణతకు రివాల్వర్ గురిపెట్టి నా కారులో వెతికారు. గమ్మత్తేమిటంటే, నేను నటుడిని అని వారికి తెలుసు. నా చిత్రాలు వారు చూసిన విషయాన్ని వాళ్ల సంభాషణ ద్వారా తెలుసుకున్నాను. ఏమాత్రం, నాకు గౌరవం ఇవ్వలేదు. నల్లవారు సమాజంలో ఎంత ఎదిగినప్పటికీ.. తెల్ల వారు గుర్తించేందుకు సిద్ధంగా లేరని నాకు అప్పుడు అర్థమైంది’ అని జాక్సన్ చెప్పారు.

  • Loading...

More Telugu News