: ఎక్స్ గ్రేషియా విషయంలో ఆలస్యంగా స్పందించిన చంద్రబాబు: వైఎస్ జగన్
సియాచిన్ లో మంచు తుపానులో అసువులు బాసిన వీర సైనికుడు ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా కింద రూ.25 లక్షలు ప్రకటించే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలస్యంగా స్పందించారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విమర్శించారు. ముస్తాక్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వీర జవాన్ లాన్స్ నాయక్ కుటుంబానికి కర్నాటక ప్రభుత్వం రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియాగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు స్పందించారన్నారు. అంతకుముందు ముస్తాక్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా మాత్రమే బాబు సర్కార్ ప్రకటించిందన్నారు. ముస్తాక్ కు నివాళిగా ఒకరోజు సెలవుదినంగా ప్రకటించాలని ఏపీ సర్కార్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. వీర సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు రాకపోవడం విచారకరమని జగన్ అన్నారు.