: బాలికను కిడ్నాప్ చేసిన 'ఫేస్ బుక్' ఫ్రెండ్స్!


ఫేస్ బుక్ స్నేహాలు మొదటికే మోసం తెస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్ స్నేహాలు, ప్రేమ... మోసాలకు, ఆర్థిక నేరాలకు కేంద్రంగా నిలవగా, తాజాగా కిడ్నాప్ వరకు కూడా చేరాయి. గోవాలోని పోర్వోరిమ్ ఏరియాలో నివాసం ఉంటున్న మైనర్ బాలికను ఫేస్ బుక్ ఫ్రెండ్స్ బయటకు రమ్మని ఫోన్ చేశారు. దీంతో ఇంట్లో చెప్పి, బయటకువెళ్లిన బాలిక ఎంత సేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఆమె గురించి చుట్టుపక్కల ఆరాతీశారు. ఆమెను ఇద్దరు వ్యక్తులతో కలసి చూశామని స్ధానికులు పోలీసులకు తెలిపారు. దీంతో ఆమె ఫేస్ బుక్ స్నేహితుల ఫోటోలు ప్రింట్ తీసుకుని వారికి చూపించారు. అందులోని ఇద్దరిని గుర్తుపట్టిన స్థానికులు వారితో బాలికను చూశామని తెలిపారు. దీంతో వారి ఫోన్ నెంబర్లను బట్టి వారు ఉంటున్న ప్రాంతాన్ని కనుగొని బాలికను రక్షించారు. ఈ ఘటనలో మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించగా, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం గోవా మెడికల్ హాస్పిటల్ కు తరలించారు. కాగా, బాలికను కారులో తీసుకువెళ్తుండగా ట్రేస్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News