: షీనాబోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియాపై హత్యారోపణలు!


గతేడాది వెలుగులోకి వచ్చి సంచలనం రేపిన షీనాబోరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మొదటి నుంచి వాదిస్తున్న ఇంద్రాణి భర్త, మీడియా మాజీ టైకూన్ పీటర్ ముఖర్జీయాపై హత్యారోపణ, సాక్ష్యాన్ని నాశనం చేయడం, నేరపూరిత కుట్ర ఆరోపణలను సీబీఐ అధికారులు మోపినట్టు సమాచారం. ఆ మేరకు ముంబయి ప్రత్యేక సీబీఐ మేజిస్ట్రేట్ కోర్టులో 59 ఏళ్ల పీటర్ పై అధికారులు సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను సమర్పించారు.

  • Loading...

More Telugu News