: జేఎన్ యూ వివాదంలో కొత్త మలుపు
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం కొత్త మలుపు తిరుగుతున్నట్టు కనబడుతోంది. జేఎన్ యూలో విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకోవడం, దేశద్రోహం కేసులు పెట్టడంతో, అసలు యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతులు లేకుండా ఎందుకు ప్రవేశించారనే వాదన మొదలైంది. దీంతో పోలీసులకు తాను అనుమతి ఇవ్వలేదని వీసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సంతకంతో పోలీసులకు రాసిన లేఖ ఒకటి బయటపడింది. దీంతో వీసీ స్వయంగా పోలీసులను ఆహ్వానించారని అర్థమవుతోందని, సమావేశానికి అనుమతి ఇచ్చిన వీసీ పోలీసులను ఎలా ఆహ్వానిస్తారని, దీని వెనుకు వ్యూహాత్మక కుట్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.