: సాక్ష్యాలు లభ్యం... 7న జేఎన్యూకు 10 మంది కాశ్మీరీలు, మొత్తం ప్లాన్ ఉమర్ ఖాలిద్ దే!
అఫ్జల్ గురు వర్థంతిని జరపాలని జేఎన్యూలోని ఓ వర్గం భావించిన మీదట, అందుకు రెండు రోజుల ముందే కాశ్మీర్ నుంచి 10 మంది వరకూ వర్శిటీ ప్రాంగణంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉమర్ ఖలీద్ అనే విద్యార్థి హస్తం ఉందని భావిస్తున్న పోలీసులు అతని జాడ కోసం వెతుతుకున్నారు. వర్శిటీలోకి వచ్చిన వారికి కొందరు విద్యార్థులు సాయపడ్డారని కూడా విచారణ వర్గాలు సాక్ష్యాలు సంపాదించాయని తెలుస్తోంది. ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఖలీద్ నెలల తరబడి ప్లాన్ వేశాడని తెలుస్తోంది. ఆపై వీరంతా కలసి అఫ్జల్ గురు సంస్మరణ సభ ఏర్పాటు చేసి భారత వ్యతిరేక నినాదాలు చేయడం, దీంతో రెండు వర్గాల మధ్య వివాదం, ఉద్రిక్తత, విద్యార్థుల సస్పెన్షన్, ప్రొఫెసర్ జిలానీ అరెస్ట్ తదితర పరిణామాలు చోటు చేసుకోగా, వివాదం రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే.