: యువత తప్పిదమా? విదేశీ కుట్రా? అసలు 'జేఎన్ యూ'లో ఏం జరిగింది?
గడచిన వారం రోజులుగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్న వివాదానికి స్వస్తి చెప్పే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తోంది. ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఓ ప్రొఫెసర్ నేతృత్వంలో విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో రభస మొదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనలు కేవలం విద్యార్థుల తొందరపాటు తప్పిదమా? లేక ముష్కర మూకలకు ఆశ్రయమిస్తున్న విదేశాల కుట్ర ఉందా? అన్న కోణంలో విచారణ వేగవంతమైంది. ఇప్పటికే కొందరు విద్యార్థులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండవచ్చన్న ఊహాగానాలు రావడంతో, ఆ దిశగా నిజాన్ని తేల్చేందుకు ఢిల్లీ పోలీసుల విన్నపం మేరకు ఎన్ఐఏ, ప్రత్యేక సిట్ రంగంలోకి దిగాయి. వర్శిటీలో జరిగిన ఘటనల వెనకున్న అసలు కారణాన్ని విచారిస్తున్నామని ఈ ఉదయం ఢిల్లీ హైకోర్టులో అరెస్టయిన వారికి బెయిలివ్వాలంటూ వచ్చిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్ వంటి నేతలు జేఎన్యూ విద్యార్థుల వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.