: టీడీపీ ఏపీ వ్యవహారాలన్నీ ఇక బెజవాడ నుంచే!... పార్టీ నేతలతో నారా లోకేశ్ కీలక భేటీ


టీడీపీ నవ్యాంధ్ర వ్యవహారాలన్నీ ఇకపై ఆ రాష్ట్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడ నుంచే సాగనున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక అడుగులేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బెజవాడలోని పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయంలో ఆయన పార్టీ ఏపీ చీఫ్ కిమిడి కళా వెంకట్రావు, వీవీవీ చౌదరి, పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయానికి స్థల ఎంపిక, కార్యాలయ బ్లూప్రింట్, నిర్మాణం తదితర అంశాలపై కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ భేటీలోనే రాష్ట్ర కార్యాలయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News