: కారుణ్య మరణాలపై ప్రజాకోర్టుదే నిర్ణయం: చేతులెత్తేసిన సుప్రీం!
ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కోలుకునే అవకాశం లేక, మరణశయ్యపై జీవచ్ఛవంలా బతుకుతున్న వారికి కారుణ్యమరణాన్ని దగ్గర చేసే విషయమై సాగుతున్న చర్చలో సుప్రీంకోర్టు చేతులెత్తేసింది. ఈ విషయంలో తాము ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేమని, ప్రజా కోర్టులోనే చర్చించి ఓ నిర్ణయానికి రావాలని కోరుతూ బంతిని పార్లమెంట్ పరిధిలోకి నెట్టింది. ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షూమాకర్ ఇదే పరిస్థితుల్లో ఉన్నాడని, ఆయన తిరిగి కోలుకుంటాడన్న ఉద్దేశంతో సంవత్సరాలుగా బతికించుకుంటూ వస్తున్నారని కోర్టు గుర్తు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ నిర్ణయానికి వెంటనే రాలేమని అభిప్రాయపడ్డ జస్టిస్ అనిల్ ఆర్. దావే నేతృత్వంలోని ధర్మాసనం, ప్రజా ప్రతినిధులు చర్చించి ఓ నిర్ణయానికి వస్తే తమకు అభ్యంతరం లేదని అన్నారు. కోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఇదో సంక్లిష్టమైన సమస్యని, పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.