: ఖేడ్ లో కారు జోరు!... భూపాల్ రెడ్డి ఖాతాలో 65 వేల ఓట్లు, ఓటమి దిశగా కాంగ్రెస్
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలో కారు వేగం జోరందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఖాతాలో 65 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ గెలుపు ఖాయమైన ఈ ఓట్ల లెక్కింపులో 14 వ రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డికి 65,177 వేల ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 26,513 వేల ఓట్లు పోలయ్యాయి. దీంతో సగం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 38,664 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక టీడీపీ అభ్యర్థికి 10,425 ఓట్లు మాత్రమే వచ్చాయి.