: హరీశ్ రావు సత్తా తేలేది నేడే... మరికాసేపట్లో ‘ఖేడ్’ కౌంటింగ్


టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సత్తా ఎప్పుడో నిరూపితమైనా... కేటీఆర్ తో సమానంగా ఈదుకు రాగలరా? అన్న రీతిలో ప్రస్తుతం తెలంగాణలో జరిగిన పోరులో చివరి ఫలితం నేడు తేలనుంది. పార్టీ అధినేత అప్పగించిన పని(గ్రేటర్ ఎన్నికలు) ఘన విజయం సాధించడం ద్వారా కేటీఆర్ సత్తా చాటారు. ఇక గ్రేటర్ ఎన్నికలకు కాస్తంత ఆలస్యంగా మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల బాధ్యతలను కేసీఆర్... ‘గెలుపు వీరుడి’గా పేరుగాంచిన హరీశ్ రావుకు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పాటు టీడీపీ కూడా పోటీ చేసింది. ఇక నేటి ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 21 రౌండ్లలో జరగనున్న ఈ కౌంటింగ్ 11 గంటల్లోగా పూర్తయి, ఫలితం తేలిపోనుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి హరీశ్ నిజంగానే గెలుపు వీరుడిగా నిలుస్తారో, లేక కిష్టారెడ్డి సానుభూతి పవనాలు వీచి ఆయన కుమారుడు సంజీవరెడ్డి గెలుస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News