: పొట్ట చుట్టూ 38 బంగారం బిస్కెట్లతో మహిళ అరెస్టు


బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కమలమ్మ (52) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీల్ ఛైర్ లో కూర్చుని అనుమానాస్పదంగా కనిపించిన కమలమ్మను విమానాశ్రయాధికారులు స్కాన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పొట్ట చుట్టూ కట్టుకున్న కాటన్ లో 38 బంగారం బిస్కెట్లను అంటే 1.27 కోట్ల రూపాయల విలువ చేసే 4.4 కేజీల బంగారాన్ని దాచి ఉంచినట్టు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, కడపకు చెందిన తాను ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లానని తెలిపారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఈ బంగారం హైదరాబాదులో అందజేస్తే వారు 4.5 లక్షల రూపాయలు ఇస్తామన్నారని ఆమె తెలిపారు. విమానం హైదరాబాదు కాకుండా బెంగళూరు వెళ్లడంతో, అక్కడ విమానాశ్రయంలో అతని కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News