: ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్ తరలింపు ఆటకట్టించారు


ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్ ముఠా రాకెట్ ఆటకట్టించారు అక్కడి పోలీసులు. హాంగ్ కాంగ్ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా తీసుకువచ్చిన 120 లీటర్ల మెతామ్ ఫెటమైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ మాఫియా ఈ మెతామ్ ఫెటమైన్ ను మహిళలు ధరించే జెల్ బ్రాలలో తెలివిగా తీసుకువచ్చింది. నిఘావర్గాల సమాచారంతో మిరాండా, హార్సట్ విల్లే, పెడాస్టో, కింగ్స్ గ్రూవ్ గోదాములపై దాడులు చేసి, జెల్ బ్రాలలో, గృహోపకరణాలలో నిలువ చేసిన డ్రగ్స్ ను కనుగొన్నామని పోలీసులు తెలిపారు. వీటి విలువ 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (7 వేల కోట్ల రూపాయలు) ఉంటుందని వారు వెల్లడించారు. ఈ 120 లీటర్ల మెతామ్ ఫెటమైన్ నుంచి 500 కేజీల క్రిస్టల్ మెత్ తయారు చేయవచ్చని వారు తెలిపారు. చైనా అధికారుల సాయంతో డ్రగ్ ముఠా ఆటకట్టించామని, ఆస్ట్రేలియా చరిత్రలో ఇదే అతిపెద్ద డ్రగ్ రాకెట్ అని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News