: శిఖర్ ధావన్ విజయ రహస్యం ఇదే!
టీమిండియాకు సచిన్, సెహ్వాగ్ జోడీ దూరమైన వేళ ఓపెనింగ్ జోడీ దొరుకుతుందా? దొరికినా సమన్వయం చిక్కుతుందా? అన్న అనుమానాలను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ పటాపంచలు చేసింది. ఈ జోడీలో ధావన్ సెంచరీ చేస్తే టీమిండియా గెలుపు ఖాయం అన్నంతగా అభిమానుల్లో సెంటిమెంట్ బలపడిపోయింది. ఈ క్రమంలో అసలు శిఖర్ ధావన్ విజయ రహస్యమేంటి? దీనికి తనే సమాధానాన్ని కూడా చెప్పాడు. బంతిని బాగా చూస్తానని, దాని గమనాన్ని సరిగ్గా అంచనా వేస్తానని, ఆ గమనాన్ని మారుస్తూ బలంగా బాదుతానని ధావన్ చెప్పాడు. ఈ సూత్రమే బాగా పని చేస్తోందని ధావన్ చెప్పాడు. రానున్న ఆసియాకప్, వరల్డ్ టీట్వంటీ సిరీస్ లలో ఈ ఫాం కొనసాగించడం అవసరమని, అది జట్టుకు కూడా చాలా మంచిదని ధావన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ సహకారంతోనే మంచి భాగస్వామ్యాలు నమోదవుతున్నాయని ధావన్ వెల్లడించాడు. డాట్ బాల్స్ తక్కువగా పడేలా చూసుకోవడమే తనను ఒత్తిడి నుంచి దూరం చేస్తుందని ధావన్ తెలిపాడు.