: బేగంపేట చేరుకున్న సైనికుడు ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం


వీరమరణం పొందిన సైనికుడు ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఇక్కడ సైనిక లాంఛనాలతో ఆర్మీ ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లాలోని నంద్యాలకు తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామం పార్నెపాలెంకు తీసుకెళతారు. ఇప్పటికే అక్కడ అంత్యక్రియలకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సైనిక లాంఛనాలతో ముస్లిం సంప్రదాయం ప్రకారం ముస్తాక్ అంతిమ సంస్కారాలు జరుగుతాయి. మరోవైపు ఇదే సమయంలో విజయవాడలో జరుగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముస్తాక్ మరణంపట్ల కేబినెట్ సంతాపం తెలిపింది. అతని కుటుంబానికి రూ.25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News