: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వరంగల్ లో మొత్తం 58 వార్డులున్నాయి. అందులో ఎస్టీ-2, ఎస్సీ-9, బీసీ-19, జనరల్-28 వార్డులు; ఎస్టీ మహిళ-1, ఎస్టీ జనరల్-1, ఎస్సీ జనరల్-5, ఎస్సీ మహిళ -4, బీసీ జనరల్-10, బీసీ మహిళ-9, జనరల్ మహిళ-15, అన్ రిజర్వుడు-13 వార్డులను కేటాయించారు. ఖమ్మం కార్పొరేషన్ లో మొత్తం వార్డులు 50 ఉన్నాయి. ఎస్టీ జనరల్-1, ఎస్టీ మహిళ-1, ఎస్సీ-జనరల్-3, ఎస్సీ మహిళ -3, బీసీ జనరల్-9, బీసీ మహిళ-8, జనరల్ మహిళ-13, అన్ రిజర్వుడు 12 వార్డులను అధికారులు ఖరారు చేశారు.