: విజయవాడలో ఏపీ మంత్రివర్గ సమావేశం
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఖరారు కావడంతో శంకుస్థాపన ఎప్పుడు నిర్వహించాలి, శాఖల తరలింపు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఫెర్రో అల్లాయిస్ కంపెనీలను ఆదుకునేందుకు రూపాయికే యూనిట్ విద్యుత్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.