: ఫేస్ బుక్ స్నేహితురాలితో వాలెంటైన్స్ డే జరుపుకోవాలని వెళ్లి... అనంత లోకాలకు!


ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ యువతితో ప్రేమికుల రోజును సంబరంగా గడుపుకోవాలని భావించి, ఆనందంగా బయలుదేరిన యువకుడి ప్రయాణం అతన్ని మృత్యుకౌగిలికి చేర్చింది. ఢిల్లీ శివార్లలోని గుర్ గాం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 27 ఏళ్ల ఈశ్వర్, గుర్ గాంలో విలాసవంతమైన సుశాంత్ లోక్ ప్రాంతానికి వచ్చాడు. ఏడు నెలల నుంచి తనతో పరిచయం పెంచుకుంటున్న స్నేహితురాలితో కాసేపు గడిపేందుకు వచ్చిన అతన్ని, హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ వద్ద రిసీవ్ చేసుకున్న ఆమె సుశాంత్ లోక్ ప్రాంతంలోని తన ఇంటికి తీసుకెళ్లింది. వీరిద్దరూ కలసి మాట్లాడుకుంటుండగా, యువతి బావ రమేష్ (30), అతని డ్రైవర్ అనిల్ కుమార్ (25) అక్కడికి వచ్చారు. ఆపై ఈశ్వర్ ను చితక్కొడుతూ, బాల్కనీ నుంచి కిందకు పడేశారు. తీవ్రగాయాల పాలైన అతన్ని రాత్రి 9 గంటలకు ఆసుపత్రిలో చేర్చగా, ఒంటిగంట సమయంలో మరణించాడు. ఈ మేరకు యువతి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News